calender_icon.png 24 December, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

24-12-2025 09:05:59 PM

- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కనీసం 80శాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగేలా చూడాలని, గర్భిణీలకు ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలన్నారు.

గర్భం దాల్చిన నాటి నుంచి కాన్పు అయ్యేంత వరకు ఆరోగ్య పరిరక్షణపై ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఆర్ బి ఎస్ కే పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన సంఖ్యలో విద్యార్థులకు స్క్రీనింగ్ చేయాలని, పనితీరు మెరుగు పరచుకోకపోతే  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం క్రిస్మస్ ను పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ సమావేశంలో డిఎంహెచ్వో వెంకటరమణ, అదనపు డీఎంహెచ్వో సుధా, డిప్యూటీ డిఎంహెచ్వోలు చందు నాయక్, రాజగోపాల్, ఇమ్యునైజేషన్ అధికారి సాజిదా, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, జిజిహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంఓ నవీన, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.