calender_icon.png 24 December, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్డ్ మెంట్ పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి

24-12-2025 09:03:32 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ, తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంయుక్త కార్య చరణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు నిరాహార దీక్షలు చెయ్యాలనె పిలుపుమేరకు బుధవారం హనుమకొండ ఏకశిలా జయశంకర్ పార్కులో పెన్షనర్ జేఏసీ జిల్లా అధ్యక్షులు ఈ.నరసింహారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీదర్ల ధర్మేంద్రల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేశారు. వి.రామ్ మనోహర్, కందుకూరి దేవదాస్, కడారి భోగేశ్వర్, టి. పురుషోత్తం కే. సుధీర్ బాబులు మాట్లాడుతూ... మార్చి 2024 నుండి నవంబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలను 20 నెలల గడిచిన చెల్లించకపోవడం దారుణం.

పెన్షనర్లను మానసికంగా వేధించడమేనని, తీవ్ర అనారోగ్యానికి గురి చేయడం ప్రభుత్వానికి సరైనది కాదని వారి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోవడంతో పెన్షనర్ల పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇల్లు కట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక బ్యాంకులన రుణాలు కట్టలేక, వృద్ధ తల్లిదండ్రులను చూసుకోలేక నానఇబ్బందులకు గురవుతున్నామని, తమ ఆరోగ్యాన్ని బాగుచేసుకోలేని దయానీయమైన స్థితిలో ఉన్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 35 మంది రిటైర్డ్ అయిన పెన్షన్ దారులు రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడంతో వారి ఆరోగ్యం క్షీణించి బాధతో కృంగిపోయి చనిపోవడం జరిగిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 14,000 మంది రిటైర్ అయ్యారని బకాయిలు చెల్లించని కారణంగా కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయిస్ ఆత్మహత్య కూడా చేసుకున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, కనీసం పిఆర్సి 2020 ఏరియర్స్, జిపిఎఫ్ బిల్లులు, లీవ్ ఇన్క్యాష్మెంట్, గ్రాడ్యుటి, కమ్యూటేషన్ సర్వీసులలో చేసుకున్న సరెండర్ లీవులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

వరంగల్, హనుమకొండ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, కోలను సంతోష్ రెడ్డి, బిజెపి మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు. అశోక్, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఏ. గోవిందా రావు లు ఈ నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేశారు. ఈ దీక్షలో పాల్గొన్నవారు ఎస్జిపిఏటి వరంగల్ జిల్లా అధ్యక్షులు టి. వీరయ్య, జి. సాంబయ్య, కే. సమ్మిరెడ్డి, ఎండి మహబూబ్ అలీ, ఈ. ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథం, బకాయిల సాధన కమిటీ ట్రెజరర్ సూర కుమారస్వామి, జాయింట్ సెక్రటరీ ఎండి అబ్దుల్ గఫర్, దామోదర్, ఎల్. ప్రభాకర్ రెడ్డి, శ్యాంరావు, మహేందర్ రావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ తదితరులు పాల్గొన్నారు.