నా ఇల్లు ఇల్లీగల్ గా ఉంటే కూల్చివేయండి: తిరుపతి రెడ్డి
29-08-2024 04:44 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు, కార్యాలయాలకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. నోటీసులపై తిరుపతి రెడ్డి స్పందించారు. తన ఇల్లు ఇల్లీగల్ గా ఉంటే కూల్చివేయండని సూచించారు. తనకు సమయం ఇస్తే ఇంట్లో ఉన్న సామాను తీసుకుని బయటకి వెళ్తా అన్నారు. శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. ఇప్పటివరకు తనను ఏ అధికారి కలువలేదని చెప్పారు. తాను ఇల్లు కొన్న సమయంలో అది ఎఫ్ టీఎల్ లో ఉన్నట్లు తనకు తెలియదన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు తన ఇంటిని పట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్ళలో వాళ్ళు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి విమర్శించారు.






