calender_icon.png 13 July, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

చేప కోసం 300 డ్యామ్‌లు కూల్చివేత

13-07-2025 12:20:02 AM

పర్యావరణ పరిరక్షణ కోసం చైనా కీలక నిర్ణయం 

న్యూఢిల్లీ, జూలై 12: పర్యావరణ పరిరక్షణలో భాగంగా చైనా కీలక నిర్ణయా లు తీసుకుంటుంది. ఒక చేప జీవజాలాన్ని, ఒక నది సహజత్వాన్ని కాపాడేందుకు ఇప్పటివరకు 300 డ్యామ్‌లను కూల్చేసింది. అంతేకాకుండా ఆ దేశంలో ఉన్న 373 హైడ్రో పవర్ స్టేషన్లలో 342 చిన్నస్థాయి హైడ్రో పవర్ స్టేషన్లలో కార్యకలాపాలను నిలిపేసింది. యాంగ్జీ నది ఆసియాలోనే అత్యంత పొడవై నదిగా గుర్తింపు పొందింది.

కొన్ని దశాబ్దాలుగా చైనా భారీగా డ్యామ్‌లు, హైడ్రోపవర్ ప్రాజెక్టులను నిర్మించింది. ఈ డ్యామ్‌లు జలచ రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. యాంగ్జీ ఉపనదుల్లో ఒకటైన చిషు య్ హే (రెడ్‌రివర్)ను అరుదైన చేపజాతులకు ఆవాసంగా గుర్తిస్తారు. చైనా నిర్మించిన డ్యామ్‌లు, పవర్ స్టేషన్‌లు చిషుయ్ హే ప్రవాహాన్ని కట్టడి చేశాయి. గతంలో ఈ నది ప్రవహించిన ప్రాంతాలకు నీరందక కొన్ని జాతులు అంతరించే దశకు చేరుకున్నాయి.

యాంగ్జీ స్టర్జన్‌గా పేరొందిన చేపను 2022లో అంతరించిపోతున్న జాతిగా ప్రకటించారు. గతంలో ఈ జాతి చేపలు యాంగ్జీ పరీవాహక ప్రాంతమంతా కనిపించేవి. డ్యామ్‌ల నిర్మాణం, అతిగా చేపలు పట్టడం లాంటి కారణాల వల్ల ఈ చేపలు అంతరించిపోయే స్థాయికి చేరాయి. 2023, 2024లో రెండు బ్యాచ్‌ల యాంగ్జీ స్టర్జన్ చేపలను నదిలో వదిలారు. అవి విజయవం తంగా నదిలో మనుగడ సాగించడం ప్రారంభించాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.