13-07-2025 12:17:57 AM
నచ్చజెప్పి బయటకు తీసుకొచ్చిన పోలీసులు
బెంగళూరు, జూలై 12: ఉత్తర కన్నడ జిల్లాలోని గోకర్ణ అడవుల్లో రహస్య జీవనం సాగిస్తుంది. ఓ గుహలో ఆమెతో పాటు ఇద్దరు పిల్లలు కూడా నివాసం ఉంటున్నారు. రామతీర్థ పర్వత ప్రాంతం లో స్థానిక పోలీసులు పెట్రోలింగ్ చేస్తు న్న క్రమంలో ఓ గుహ వద్ద దుస్తులు ఉండడం గమనించిన పోలీసులు అనుమానంతో గుహలో వెతక గా.. అందులో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
ఆ మహిళను రష్యాకు చెందిన నైనా కుటినా అలియాస్ మోహిగా గు ర్తించారు. ఆరు, నాలుగేళ్ల వయసున్న పిల్లలతో ఆమె గుహలో నివాసం ఉం టోంది. ఆ మహిళ బిజినెస్ వీసాపై వచ్చి ఉంటోంది. 2017లోనే ఆ మహిళ వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. విష సర్పాలు, వన్యమృగాలు ఉండే ఆ అడవిలో మహిళ ఎలా జీవనం సాగించిందని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం ఆమెను స్థానిక ఆశ్రమానికి తరలించి రష్యన్ ఎంబసీకి విషయం తెలియజేశారు. త్వరలోనే ఆమెను బెంగళూరుకు తరలించి అక్కడి నుంచి రష్యాకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. హి ందుత్వం, ఆధ్యాత్మికతకు ఆకర్షితురాలై ఇక్కడే ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.