13-07-2025 12:22:39 AM
కోల్‌కతా, జూలై 12: పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై వరుస అఘాయిత్యా లు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెల లా కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థినిపై సాముహిక అత్యాచారం ఘటన మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) క్యాంపస్‌లో చదువు తున్న ఒక విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడటం సంచలనం కలిగించింది.
కౌన్సెలింగ్ ఇస్తానని చెప్పి బాయ్స్ హాస్టల్‌కు పిలిచి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. విద్యార్థిని ఫిర్యాదు మేర కు హరిదేవ్‌పూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు ల వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా మానసిక సమస్యలు ఎదుర్కొం టున్న బాధితురాలికి కౌన్సెలింగ్ ఇస్తానని చెప్పి అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థి బాయ్స్ హాస్టల్‌కు పిలిపించుకున్నాడు.
అనంతరం మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు స్పృహలోకి వచ్చాకా తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని గ్రహించింది. అత్యాచారం గురించి ఎవరికైనా చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిందితుడు సద రు విద్యార్థిని హెచ్చరించాడని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే తనపై అత్యాచా రం జరిగిందని విద్యార్థిని ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవపై ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పం దించాయి. రాష్ట్రంలో మహిళలకు భద్ర త కరువైందంటూ తృణముల్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం చేశాయి.
నా బిడ్డపై అత్యాచారం జరగలేదు
ఐఐఎం కోల్‌కతా క్యాంపస్‌లో విద్యార్థినిపై అత్యాచారం దుమారం రేపిన వేళ బాధితురాలి తండ్రి ‘తన బిడ్డపై అత్యాచారం జరగలేదని’ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. విద్యార్థిని తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘ నా కుమార్తెపై అత్యాచారం జరగలేదు. నిన్న రాత్రి 9.34 గంటల సమయంలో నా కుమార్తెకు యాక్సిడెంట్ అయిందని.. ఆటో రిక్షా నుంచి కిందపడినట్టు ఫోన్ వచ్చింది.
ఆ తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి లొకేషన్ ట్రాక్ చేయగా ఎస్‌ఎస్‌కేఎమ్ ఆసుపత్రిలో ఉన్నట్టు తెలిసింది. ఆమెను కాపాడి ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు చెప్పారు. నా కుమార్తె ను ఎవరు వేధించలేదని.. ప్ర స్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసు లే అత్యాచార ఆరోపణలు చేయాలంటూ నా కూతురుని బలవంతపెట్టిన ట్టుగా అనిపిస్తోంది’ అని వివరించాడు.