calender_icon.png 8 October, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కట్టడాల కూల్చివేత

08-10-2025 12:44:02 AM

* అధికారుల కక్షసాధింపు చర్యలని వ్యాపారుల ఆగ్రహం

జహీరాబాద్, అక్టోబరు 7 :జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ వెళ్లే రోడ్డులో గల అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మంగళవారం మున్సిపల్ అధికారులు, పోలీసులు దుకాణాల ముందు ఏర్పాటు చేసిన అక్రమ కట్టడాలను జెసీబీల సహాయంతో కూ ల్చివేశారు. సిద్ధి హోటల్ పక్కనుండి 50 ఫీట్ల రోడ్డులో గల అక్రమ కట్టడాలను కూల్చివేశారు. దీంతో పలువురు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జహీరాబాద్ లోని భవాని మందిర్ రో డ్డు, బ్లాక్ రోడ్డు, హనుమాన్ మందిర్ రోడ్డు, లతీఫ్ రోడ్డు, ప్రభుత్వ హాస్పటల్ పక్క రోడ్డులలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినప్పటికీ మున్సిపల్ అధికారులు కేవలం తమపై మాత్రమే కక్ష సాధింపులకు దిగుతున్నారని పలువురు వ్యాపారస్తులు అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు దమ్ముంటే ఆ రోడ్డులలో గల అక్రమ కట్టడాలను కూల్చివేయాలని వారు సవాల్ చేశారు. ప్రతినిత్యం రద్దీగా ఉండే రోడ్లలో అక్రమ కట్టడాలు మున్సిపల్ అధికారులకు కనబడటం లేదా అని విమర్శించారు. కూల్చివేతకు మున్సిపల్ అధికారులు పోలీసుల సహాయం తీసుకోవడంతో జహీరాబాద్ టౌన్ సిఐ శివలింగం, ఎస్‌ఐ వినయ్ కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు.