calender_icon.png 8 October, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా జీవితంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

08-10-2025 12:44:53 AM

మాజీ మంత్రి జీవన్ రెడ్డి 

జగిత్యాల అర్బన్, అక్టోబర్ 7(విజయ క్రాంతి): ప్రజా జీవితంలో ఉన్నవారు అభిప్రాయాలు వెల్లడించేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సహచర మంత్రి లక్ష్మణ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి మంగళవారం స్పందించారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూపొన్నం ప్రభాకర్ మాదిగ సమాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని కించపరిచినట్టు సంభాషించటం దురదృష్టకరమన్నారు.అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని, కొన్ని సందర్భాల్లో మాట జారవచ్చని, అలాంటప్పుడు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం హుందా తనాన్ని తెలియజేస్తుందన్నారు.

సమాజంలోదళితులకు అగౌరవం, అభద్రతాభావం రానివ్వకూడదన్నారు.పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు దురదృ ష్టకరమని, ఆయన తన వ్యాఖ్యలనువెనక్కి తీసుకుంటే గౌరవంగా ఉంటుందన్నారు.బాధ్యతాయుత పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా, బాధ్యతతో తమ భావాలను వ్యక్తం చేయాలని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.దళిత సమాజాన్ని, నిమ్న వర్గాలను కించపరిచేవిదమైన భావాలు రా కుండా చూసుకోవాలన్నారు.