calender_icon.png 8 October, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ట్రాంగ్ రూం, లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

08-10-2025 12:42:55 AM

మెదక్, అక్టోబర్ 7 (విజయక్రాంతి):స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపుకు కేంద్రం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ మంగళవారం పరిశీలించారు. ఎంపి టిసి, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గురుకుల పాఠ శాల, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చే యనున్న స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

స్ట్రాంగ్ రూముల భద్రత, సీసీ కెమెరా, పోలీస్ బందోబస్తు, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై ఆయన ఆరా తీశారు. ఎన్నికల సమయంలో ఎటువంటి లోపాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, లెక్కింపు రూముల్లో విద్యుత్, లైటింగ్, భద్రత వంటి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సౌకర్యాల కల్పనపై ధ్రువీకరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జెడ్పీ సీఈవో ఎల్లయ్య, మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ఉన్నారు.