17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఇంజాపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

27-06-2025 01:17 AM

సర్వే నెం.199లో అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా

తుర్కయంజాల్, జూన్ 26:తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్ లోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. ఇంజాపూర్ రెవెన్యూ సర్వే నెంబర్ 199లోని ప్రభుత్వ భూమిలో కొం తమంది వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని విజయక్రాంతి దినపత్రికలో ఇటీవలే కథనం వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ కథనాలపై స్పందించిన రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను జేసీబీలతో కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముందస్తు నోటీసులు ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేదిలేదన్నారు. మరోసారి అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులకు స్థానికులు సహకరించాలని కోరారు.