28-07-2025 12:57:40 AM
మున్సిపల్ అధికారుల తీరుపై మాజీమంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం
జగిత్యాల అర్బన్, జూలై 27 (విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్రంలో గత కాంగ్రెస్ పా లనలో జగిత్యాల పట్టణ నిరుపేదల కోసం నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు కూల్చేయడం పట్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చే శారు.
మౌలిక సదుపాయాల కల్పన పేరుతో వివిధ దశల్లో నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను తమకు సమాచారం లేకుండా కూ ల్చివేశారనే లబ్ధిదారుల ఫిర్యాదు మేరకు ఆ దివారం జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి నూకపల్లి హౌసింగ్ కాలనీ సందర్శింఛారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి విలేకరుల స మావేశంలో మాట్లాడారు.
జగిత్యాల పట్టణం లో ఇళ్లు లేని నిరుపేదలకు నూకపల్లి లో 40 00 ఇల్లు కేటాయించి, ప్రభుత్వ నిధులు వె చ్చించిందని,ఐతే గత పాలకులు పూర్తిస్థాయి లో నిధులు కేటాయించకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయన్నారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం యధావిధిగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే కాంగ్రెస్ కు ఎక్కడ పేరు వస్తదో అని ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయకుండా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టారన్నారు.
తక్కువ స్థలంలో ఎక్కువ లబ్ధిదారులు ఉన్నట్లయితే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించాల్సి ఉండ గా పట్టణ పేదలకు సరిపడా భూమి ఉన్నప్పటికీ మళ్లీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ని ర్మించారన్నారు. పేదలను సొంత ఇంటి య జమానులను చేసేందుకు రూపొందించిన పథకం నూకపెల్లి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ను గత పాలకులు నీరుగార్చారని జీవ న్ రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్బన్ హౌసిం గ్ కాలనీలో మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లగా రు.52 కోట్లు మంజూరు చేశారని జీవ రెడ్డి తెలిపారు.
ఆ నిధులతో నిరుపయోగంగా ఉన్న ఖాళీగా స్థలంలో పాఠశాల, వైద్యశాల, అంగన్వాడి కేంద్రం తదితర నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా నిర్మాణం వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను రాత్రికి రాత్రి కూలగొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇండ్లు కూలగొ ట్టిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. నష్టపోయిన నిరుపేదలకు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిం చాలని జీవన్‌రెడ్డికోరారు.