10 August, 2026 | 4:05 AM

పలు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ

02-09-2025 07:15 PM

మునుగోడు,(విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి అన్నారు. మంగళవారం మండలంలోని కిష్టాపురం, పలివేల, రావి గూడెం, కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసి, మధ్యాహ్నం భోజనం, రిజిస్టర్లను పరిశీలించి మాట్లాడారు. వర్షాకాలము తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ఉన్నత పాఠశాలలో ఎల్ఐపీ కార్యక్రమాలు ఫలవంతంగా కొనసాగించాలని అన్నారు.

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక కార్యచరణ రూపొందించుకోవాలని సూచించారు.విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క సామర్థ్యాలను పరీక్షించారు అదేవిధంగా ఉన్నత పాఠశాలలో ఆన్లైన్ తరగతులు ఐ ఎఫ్ పి ప్యానల్ ద్వారా విద్యార్థులు తొందరగా అర్థం చేసుకుంటారని తగిన సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలని కోరారు.