గిరిజనులకు సంక్షేమ ఫలాలు అందించాలి
02-09-2025 07:09 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆదివాసి గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేర్చాలని లక్ష్యంతోనే ప్రభుత్వం ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఈ కార్యక్రమం అమలుపై ఉద్యోగులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ప్రారంభించారు. జిల్లాలో 9 మండలాల్లో ఈ కార్యక్రమం అమలవుతుందని ఇందులో అన్ని శాఖలు సమన్వయంతో అభివృద్ధి సంక్షేమ పథకాలను ఉపాధి అవకాశాలను గిరిజనులకు అందించవలసి ఉంటుందని తెలిపారు.






