ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
15-05-2024 02:14 AM
కరీంనగర్ సిటీ, మే 14: మంత్రి శ్రీధర్‌బాబు స్వగ్రామం ధన్వాడలో శ్రీ దత్తా త్రేయ స్వామి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఉప ముఖ్యమం త్రి భట్టి విక్రమార్కకు సుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ బైపాస్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘన స్వాగతం పలికారు. భట్టికి స్వాగతం పలికిన వారిలో మాజీ ఎమ్మె ల్యే ఆరెపల్లి మోహన్, నాయకులు అరుణ్‌కుమార్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, విక్టర్, కుర్ర పోచయ్య, పోరండ్ల రమేశ్ తదితరులు ఉన్నారు.




