2 April, 2026 | 11:16 AM

కంటోన్మెంట్‌లో 51.61% పోలింగ్

15-05-2024 02:17 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే సోమవారం కంటోన్మెంట్ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరిగింది. మొత్తం 232 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ జరగగా, 51.61 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 2,53,706 మంది ఓటర్లు ఉండగా 1,30,929 మంది పోలింగ్‌లో పాల్గొన్నారని రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయుడు తెలిపారు.