calender_icon.png 27 May, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు జిల్లాలో ఉపముఖ్యమంత్రి పర్యటన

26-05-2025 12:53:20 AM

-పలు గ్రామాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సిద్ధం

-ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్  

నాగర్కర్నూల్, మే 25 (విజయక్రాంతి); నాగర్కర్నూల్ జిల్లాలో విద్యుత్ అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడుతోంది. సో మవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భ ట్టి విక్రమార్క చేతుల మీదుగా అచ్చంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసే విద్యుత్ సబ్‌స్టేషన్లతో పాటు నూతన సబ్ స్టేషన్‌ల కోసం శంకుస్థాపనలు చేయనున్నారు.

అందుకు ఆదివారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బల్మూర్ మండలంలోని గట్టు తుమ్మెన్ గ్రామంలో ఏర్పాట్లను పరిశీలించారు. విద్యుత్, రెవె న్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి శిలాఫలకావిష్కరణ, పబ్లిక్ మీ టింగ్ స్థలాలను తనిఖీ చేశారు.

రూ.25 కోట్లతో పోల్కంపల్లి, రూ.1.82 కోట్లతో బొ మ్మనపల్లి, రూ.1.73 కోట్లతో పదర గ్రామా ల్లో నిర్మించనున్న 33/11 కెవి సబ్స్టేషన్ల శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారు. లింగాల మండలంలోని భాకారం (రూ.2.24 కోట్లు), గట్టు తుమ్మెన్ (రూ.2.54 కోట్లు), కంసాన్పల్లి (రూ.2.49 కోట్లు), ఉల్పర (రూ.2.74 కోట్లు), సింగారం (రూ.1.99 కోట్లు) గ్రామాల్లో ఏర్పాటు కాబోయే సబ్స్టేషన్లకు శంకుస్థాపనలు చేయనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పబ్లిక్ మీటింగ్కి హాజరుకానున్నట్లు కలెక్టర్ తెలిపారు.  అంతకుముందు జిల్లాలో నిర్వహించిన గ్రామ పాలన అధికారి పరీక్షలు లను ఆయన పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 119 మంది అభ్యర్థులకు గాను 112 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరీక్షలు ప్రశాంతంగా జరిగాయనితెలిపారు.