27-05-2025 12:38:13 PM
మేడ్చల్,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ(Maoists Threatening Letter) కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్(Former MLA Kuna Srisailam Goud) సోదరుడి బెదిరింపు లేఖ వచ్చింది. కూన రవీందర్ గౌడ్ కుమారుడు కూన రఘవేందర్ గౌడ్ ను చంపుతామని అందులో పేర్కొన్నారు. ఇంటి ముందు ఉన్న వస్తువులను ధ్వంసం చేసి ఓ గుర్తు తెలియని వ్యక్తి కారుపై ఎరుపురంగు టవల్ లో లేఖను పెట్టి వెళ్లాడు.
రూ.50 లక్షలు ఇవ్వకపోతే చంపుతానంటూ, తనుకున్న రెండు ఇళ్లను బాంబులతో పేల్చేస్తామని లేఖ ద్వారా హెచ్చరించి, మరుసటి రోజు వస్తానని.. డబ్బులు సిద్దం చేయాలని దుండగుడు బెదిరించారు. ఈ ఘటన మే 21వ తేదీన జరిగినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రఘవేందర్ గౌడ్ వెల్లడించారు. సీసీ కెమెరాల్లో పరిశీలించగా ఓ వ్యక్తి మాస్క్ ధరించి వచ్చినట్లు గుర్తించామన్నారు. రఘవేందర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.