26-05-2025 12:53:07 AM
శేరిలింగంపల్లి, మే 25:శేరిలింగంపల్లి ని యోజకవర్గ పరిధిలో ఇల్లు లేని నిరుపేదలు భూపోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రామకృష్ణ పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ నాలుగో మహాసభ ఇజ్జత్ నగర్ లో ఎస్.కొండలయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ శేర్లింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి సిపిఐ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ. ..గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తా అని చెప్పి మరిచిపోయిందన్నారు. ఈ ప్రభుత్వమైనా డబల్ బెడ్రూమ్ లు ఇవ్వకపోతే ప్రభుత్వ భూమిలో భూ పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్స రాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ పేదవానికి సొంతిల్లు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
పేదలకు సొంతింటి కల నె రవేర్చేవరకు ప్రభుత్వంపై అలుపెరగని పో రాటాలు చేస్తామన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం పేరుకే గొప్ప గాని మౌలిక వస తులు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీలను ప్రకటించారు. సుభాష్ చంద్రబోస్ నగర్ శాఖ కార్యదర్శిగా.. బి నారా యణ, సహాయ కార్యదర్శిగా సాయి తేజ,మ సీదు బండ శాఖ, కార్యదర్శిగా సీనయ్య, స హాయ కార్యదర్శిగా లక్ష్మణ్ లను ఏకగ్రీవం గా ఎన్నుకున్నామనిపేర్కొన్నారు.