హైదరాబాద్: రెవెన్యూ శాఖకు సంబదించి ఎల్ఆర్ఎస్ పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ విధివిధానాలపై మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ అధికారులతో చర్చించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలతో 33 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కారించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఫైనాన్స్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రామకృష్ణారావు, ల్యాండ్ అండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సెక్రెటరీ జ్యోతి బుద్ద ప్రకాష్, జీహెచ్ఎంసీ కమిషనర్ కాట అమ్రపాలి, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.