24 June, 2026 | 1:03 AM

జూలై 2 నుంచి ఫుడ్ ఫెయిర్

24-06-2026 12:00 AM

ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ముషీరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఆహార, పానీయాల ఆవిష్కరణలు వినియోగదారుల అభిరుచుల మేరకే జరగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు జరిగే ’ఫుడ్ ఎ’ఫెయిర్ 2026’ ప్రదర్శన ప్రారంభించాలని కోరుతూ హైదరాబాద్ ప్రజా భవన్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ను ప్రదర్శన నిర్వాహకులు కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్బంగా మల్లు బట్టి విక్రమార్క ’ఫుడ్ ఎ’ఫెయిర్ 2026’ ప్రదర్శన పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడుతూ  ప్రజల ఆరోగ్యం కోసం నిర్వహించే ’ఫుడ్ ఎ’ఫెయిర్ 2026’ కు తప్పకుండ హాజరై ప్రారంభిస్తానని అన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆహార తయారీదారులు, ప్రాసెసర్లు, ఆతిథ్య రంగ నిపుణులు, స్టార్టప్లు, ఎంఎస్‌ఎంఈలు, పారిశ్రామిక భాగస్వాములు ఒకచోట చేరి, ఆహార మరియు అనుబంధ రంగాలలోని సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలలో పారిశ్రామిక వృద్ధి, వ్యవస్థాపకత,  పెట్టుబడులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నొక్కిచెప్పారు.

ఈ సందర్బంగా నిర్వాహకులు శ్రీకాంత్ పూనాటి, కె. కార్తీక్ రెడ్డిలు  మాట్లాడుతూ ఉత్తేజకరమైన పాకయాత్ర, ఆహార ఆవిష్కరణ, సుస్థిరత, వృద్ధి ప్రయాణంలో ఈ ’ఫుడ్ ఎ’ఫెయిర్ 2026’ ప్రదర్శనలు  వ్యూహాత్మక మైలురాళ్ళుగా నిలుస్తాయన్నారు. దక్షిణ భారతదేశపు ఆహార, పానీయాలు,  అనుబంధ పరిశ్రమల ప్రదర్శనకు ముఖద్వార వాణిజ్య ప్రదర్శన అయిన ’ఫుడ్ ఎ’ఫెయిర్ 2026’ జూలై 2, 3, 4వ తేదీన హైదరాబాద్లోని  హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుందని తెలిపారు.