డిప్యూటీ సీఎం సభకు ఏర్పాట్ల పరిశీలన
14-07-2026 01:08 AM
మల్దకల్, జూలై 13: కుర్తిరావుల చెరువు గ్రామంలో మంగళవారం జరగనున్న నూతన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బహిరంగ సభ ఏర్పాట్లను సర్పంచ్ కే. భగవంతు పరిశీలించారు. మాజీ డీసీసీ చైర్మన్ పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ మైదానంలో ఏర్పాటు చేసిన సభా స్థలాన్ని ఎంపీడీవో ఆంజనేయ రెడ్డి, గ్రామ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, కొత్త సబ్స్టేషన్తో లో-వోల్టేజ్ సమస్య తొలగిపోయి రైతులకు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దేవన్న, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.






