29 April, 2026 | 3:21 AM

జనగణన సెల్ఫ్ ఎన్‌రోల్‌మెంట్ పూర్తి చేసిన డిప్యూటీ మేయర్

29-04-2026 12:45 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 28(విజయక్రాంతి): రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మంగళవారం తన కార్యాలయంలో జన గణన (సెన్సస్) సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన గణన కార్యక్రమంలో భాగంగా, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆయనను కలిసి ఈ ప్రక్రియను నిర్వహించారు.

మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీపీ వేణు మరియు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తేజస్విని గార్లు డిప్యూటీ మేయర్ను కలిసి ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ ఎన్రోల్మెంట్ వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు జన గణన అత్యంత కీలకమని,నగర ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, అధికారులకు సహకరిస్తూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.