13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

టెక్నికల్ తప్పులను సరిచేయండి

27-03-2026 12:23 AM

అసెంబ్లీలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

దేవరకద్ర, మార్చి 26 : ఇందిరమ్మ ఇం డ్లు అద్భుతంగా నిర్మాణం జరుగుతుందని కొందరి లబ్ధిదారుల విషయంలో టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవా లని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఇంది రమ్మ ఇండ్ల లబ్ధిదారుల విషయంలో ఎల్ 2, 3 విషయాల్లో టెక్నికల్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఎల్3 లిస్ట్ లో ఉన్న టెక్నికల్ ఇష్యులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

ఎల్ 2 లిస్ట్ కు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరై, ఫ్లాట్స్ లేక లబ్ది దారులు ఇల్లు కట్టుకోలేక పోతున్నారన్నారు. త్వరితగతిన అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న గ్రామాలలో ఇల్లు లేని వారికి ఫ్లాట్స్ శాంక్షన్ చేస్తే, వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటారని పేర్కొన్నారు. మూసాపేట్, కౌకుంట్ల మండలాలలో ప్రభు త్వ కార్యాలయాలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఈ రెండు మండలాలలో మండల కాంప్లెక్స్ లను మంజూరు చేయాలన్నారు.