13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఆస్పత్రి ఆవరణలో కుక్కలు ఉండకుండా చేస్తున్నాం

27-03-2026 12:25 AM

జిల్లా ప్రధాన జనరల్ హాస్పిటల్ సూపర్టెండెంట్ రంగా అజ్మీరా 

మహబూబ్ నగర్ టౌన్, మార్చి 26: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులను కుక్కలు కరిచిన ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం తక్షణమే స్పందించిందని ఆస్పత్రి సూపర్కంటెంట్ డాక్టర్ రంగా అజ్మీర అన్నారు.

సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, నిరంతరం 24 గంటల పాటు శ్రమించి ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న కుక్కలను గుర్తించి, ఇప్పటివరకు 3 కుక్కలను పట్టుకొని సురక్షితంగా తరలించినట్లు పేర్కొన్నారు. రోగులు, బంధువుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మరింత కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయన్నారు.