calender_icon.png 12 September, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

12-09-2025 12:00:00 AM

రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, సెప్టెంబరు 11 (విజయ క్రాంతి): ప్రజా పాలన ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ కా ర్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పలు అభివృ ద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆకునూరు గ్రామంలో కేజీబీవి పాఠశాలలో 90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో డార్మెంటరీ హాల్ & భవన మరమత్తులు & మురికి కాలువల ని ర్మాణానికి శంకుస్థాపన, 5 లక్షల రూపాయల తో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు.

మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు. వేంకటేశ్వర్లపల్లి లో 5 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్, బూడిద పల్లిలో 5 లక్షల రూపాయల వ్యయంతో ఓ పెన్ జిమ్ ను ప్రారంభించారు. 12 లక్షల రూపాయల వ్యయంతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు.

ఎక్లాస్ పూర్ లో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రా మాల్లో ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తున్నామని, గ్రామాల్లో రోడ్లు, నాళాలు, అంగ న్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభించుకుంటున్నామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తం మహిళా సంఘాలకు మా నాన్న పేరు మీద స్టీల్ బ్యాంక్ పంపిణీ చేస్తున్నామని, ప్రతి హోటల్ లో స్టీల్ సామాగ్రి ఉండేలా పంపి ణీ చేశామన్నారు.

ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరు స్టీల్ వస్తువులు వాడాలని సూచించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు ఇలా అన్నో పథకాలు అమ లు చేస్తున్నామన్నారు. యూరియా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని, కేంద్రం యూరియా తగినంత సరఫరా చేయాలని కేంద్రమంత్రులకు పలుమార్లు విజ్ఞప్తి చేశామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, యూరియా సమస్య తీరుతుందని మంత్రితెలిపారు.