calender_icon.png 12 September, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెన్ జడ్‌లో విభేదాలు!

12-09-2025 12:39:43 AM

నేపాల్‌లో ఖైదీలు పరార్ 

-భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మృతి

-కొనసాగుతున్న కర్ఫ్యూ 

-తాత్కాలిక ప్రధాని ఎవరు?

-జెన్ జడ్ నేతల బాహాబాహీ

-తెరపైకి కుల్మన్ ఘీసింగ్ పేరు!

-34కి చేరుకున్న మృతుల సంఖ్య

ఖాట్మాండు, సెప్టెంబర్ 11: నేపాల్‌లో అల్లర్ల అదును చూసి పలువురు ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయారు. పారిపోతున్న వారిపై భద్రతా దళాల కాల్పులతో ముగ్గురు ఖైదీలు మృతిచెందారు. అల్లర్ల నేపథ్యంలో దేశంలోని వివిధ జైళ్ల నుంచి దాదాపు 15 వేల మంది ఖైదీలు పరార్ అయ్యారు. అల్లర్లు మొదలైనప్పటి నుంచి జైలు నుంచి పారిపోతూ మరణించిన ఖైదీల సంఖ్య ఎనిమి దికి చేరుకుంది. మరోవైపు నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం కూడా కర్ఫ్యూ కొనసాగించారు.

ఖాట్మాండు, లలిత్‌పూర్, భక్త్ పూర్ జిల్లాల్లో శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూని పొడగిస్తున్నట్టు నేపాల్ ఆర్మీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అల్లర్ల నేపథ్యంలో నేపాల్‌లో బుధవారం సాయంత్రం కర్ఫ్యూ విధించారు. గత కొద్ది రోజులుగా ఐకమత్యంగా ఉండి నిరసనలు చేస్తున్న జెన్ జడ్‌లో దేశ తాత్కాలిక ప్రధాని ఎవరనే విషయంపై విభేదాలు వచ్చాయి. నేపాల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం ముందు జెన్ జడ్ వర్గం నేతలు బాహాబాహీకి దిగారు.

నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుశీల కర్కి పేరు వినిపించగా.. ప్రస్తుతం నేపాల్ విద్యుత్ బోర్డు మాజీ ఎండీ కుల్మన్ ఘీసింగ్ పేరు తెర మీదకు వచ్చింది. జెన్ జడ్ నాయకుల్లో కొంత మంది కుల్మన్ నాయకత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. వయ స్సు, అర్హత వివిధ కారణాల వల్ల సుశీలా కర్కిని నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని సమాచారం. నేపాల్ రాజ్యాంగం ప్రకారం ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు ప్రధాని పదవి చేపట్టేందుకు అన ర్హులు.

అంతే కాకుండా సుశీల కర్కి వయసు ప్రస్తుతం 70 సంవత్సరాలు దాటింది. ఇక ఈ నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 34కి చేరుకుంది. విదేశీయులకు నేపాల్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ ఉచిత వీసా రెన్యూవల్ కల్పిస్తోంది. ఖాట్మాండు విమానాశ్రయంలో ఈ సర్వీసులు ప్రారం భించారు. తాత్కాలిక నేత గురించి ఆర్మీతో చర్చల ముందు జెన్ జడ్‌లో విబేధాలు తలెత్తాయి. రెండు గ్రూపులుగా చీలిపోయి కొట్టుకున్నారు. ఒక గ్రూపు సుశీల కర్కి నాయకత్వానికి మద్దతు పలుకుతుండగా.. మరో గ్రూపు కుల్మన్ ఘీసింగ్ నాయకత్వం కావాలని పట్టుబడుతోంది. 

నిరసనకారులు శాంతంగా ఉండాలని ఖాట్మాండు మేయర్ బలేన్ షా విజ్ఞప్తి చేశా రు. ‘జెన్ జడ్ నిరసనకారులారా దయచేసి ఓపిక పట్టండి. ప్రస్తుతం దేశం ఎవరూ ఊహించని స్థితిలో ఉంది. మీ ఉజ్వల భవిష్యత్ కోసమని మీరు ఇదంతా చేస్తున్నారు. ఈ సమయంలో ఎటువంటి భయానికి లోను కాకండి. శాంతంగా ఉండండి. దేశం లో త్వరలోనే మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతుంది. కొత్త ప్రభుత్వం కోసం కొత్తగా ఎన్నిక జరగబోతుంది. దేశంలో ఎన్నికలు నిర్వహించి.. కొత్త ప్రభుత్వాన్ని నియమించడమే మధ్యంతర ప్రభుత్వం విధి’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

తెరపైకి ఘీసింగ్ పేరు.. 

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్ బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వానికి జెన్ జడ్‌లో వర్గాలు ఆమోదం తెలిపాయని సమాచారం. తాత్కాలిక ప్రభుత్వాధినేత రేసులో నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి, ఖాట్మాండు మేయర్ బాలేంద్ర షా పేర్లు వినిపించగా.. గురువారం కొత్తగా విద్యుత్ బోర్డు మాజీ ఎండీ కుల్మన్ ఘీసింగ్ పేరు తెరపైకి వచ్చింది. 

జెన్ జడ్ బాహాబాహీ

నేపాల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం ముం దు జెన్ జడ్ నాయకులు బాహాబాహీకి దిగారు. కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్న జెన్ జడ్ వర్గం రెండుగా చీలిపోయింది. తాత్కాలిక సారథి విషయంలోనే జెన్ జడ్ రెండు వర్గాలుగా చీలిపోయినట్టు తెలుస్తోం ది. గురువారం ఆర్మీ ప్రతినిధులు జెన్ జడ్ నాయకులతో చర్చలు జరిపారు. ఈ చర్చలకు ముందు నేపాల్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ముందు జెన్ జడ్ నాయకులు కొట్టుకున్నారు.

వారిలో ఒక వర్గం సుశీల కర్కికి మద్దతిస్తుంటే.. మరో వర్గం ఘీసింగ్ నాయకత్వం కావాలని పట్టుబడుతోంది. భద్రకాళి లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్, జెన్ జడ్ నాయకులు చర్చలు జరిపారు. ‘జెన్ జడ్ నాయకులతో చర్చలు జరిపాం. ప్రధానంగా ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడేందుకు.. దేశంలో శాంతి, భద్రతలు నెలకొల్పే అంశంపైనే చర్చలు జరిగాయి’ అని ఆర్మీ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. 

రాజ్యాంగాన్ని సవరించాల్సిందే.. 

నేపాల్ పార్లమెంట్‌ను రద్దు చేసి రాజ్యాంగాన్ని సవరించాలని జెన్ జడ్ నాయకులు డిమాండ్ చేస్తున్నా రు. సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం ప్రధాని రాజీనామా వరకు వెళ్లింది. అయినా నిరసనకారులు శాంతించడం లేదు. ‘ఇది పూర్తిగా పౌర ఉద్య మం. కాబట్టి మీ రాజకీయ ఎత్తులు వేసేందుకు చూడకండి’ అని జెన్ జడ్ వర్గం తెలిపింది. నేపాల్ ప్రధాని రామచంద్ర పౌడేల్ ఎట్టకేలకు మౌనం వీడారు.

జెన్ జడ్ ఉద్యమం మొదలైన తర్వాత తొలిసారి స్పం దించిన రామచంద్ర శాంతి, సమన్వ యం పాటించాలని ఒక ప్రకటనలో కోరారు. ‘దేశంలోని అన్ని వర్గాల వా రు శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తు న్నా. అతి త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా. శాంతి, భద్రతలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నా’ అని పేర్కొన్నారు. 

భారత్‌లో విద్యనభ్యసించిన ఘీసింగ్.. 

తాత్కాలిక ప్రభుత్వాధినేత రేసులో అనూహ్యంగా ముందుకువచ్చిన కుల్మన్ ఘీసింగ్ భారత్‌లో విద్యనభ్యసించారు. తూర్పు నేపాల్‌లోని రమేచ్చాప్ జిల్లాలో జన్మించిన ఘీసింగ్ సెకండరీ విద్య ఖాట్మాండులో సాగింది. జంషెడ్‌పూర్‌లోని రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఉచిత స్కాలర్‌షిప్ లభించడంతో భారత్‌కు వచ్చి ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేపాల్‌లోని పుల్‌చౌక్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి చేశారు. నేపాల్ ప్రభుత్వాధీనంలో నడుస్తున్న విద్యుత్ బోర్డు ఎండీగా కూడా ఘీసింగ్ విధులు నిర్వర్తించారు.