calender_icon.png 12 September, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పీల్‌కు టీజీపీఎస్సీ

12-09-2025 12:42:27 AM

-గ్రూప్ వివాదంలో సింగిల్ బెంచ్ తీర్పుపై రివ్యూకు నిర్ణయం 

-పేపర్లు దిద్దితే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని భావన 

-గ్రూప్ తీర్పుతో ఇప్పట్లో నోటిఫికేషన్లు లేనట్లే!

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): గ్రూప్ అంశంపై తెలంగాణ పబ్లి క్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక నిర్ణ యం తీసుకున్నది. గ్రూప్ ఫలితాలు రద్దు, జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దుతోపాటు మెయిన్స్ పేపర్లను రివాల్యుయేషన్ చేయాలని మంగళవారం వెలువరించిన హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని టీజీపీఎస్సీ భావిస్తోంది.

రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయిం చినట్లుగా తెలిసింది. ఇప్పటికే ఇందుకు సం బంధించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నది. రీవాల్యూయేషన్ చేపడితే సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముండడంతో రివ్యూకు వెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. హైకోర్టు తీర్పుపై గత రెండు రోజులుగా ఎలా ముందుకెళ్లాలి? ఏం చేయాలనే దానిపై సమావేశమైన కమిషన్..గురువారం తాజాగా సమావేశమై దీనిపై చర్చించారు.

అయితే ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించారు. పేపర్ వాల్యుయేషన్ సక్రమంగానే చేపట్టామని.. కాబట్టి రివ్యూకు వెళ్లాలని కమిషన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మూడు రోజులుగా ప్రభుత్వం, ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో టీజీపీఎస్సీ చర్చిస్తున్నది. ఈ క్రమంలోనే హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలనే ఆదేశాలు ప్రభుత్వం నుంచి కమిషన్‌కు రావడంతో రివ్యూ కోసం డివిజన్ బెంచ్‌కు వెళ్లా లని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వీలైనంత త్వరగా దీనిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది. ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తును చేపడుతున్నారు. అయి తే కోర్టు ముందు ఈసారి పకడ్బందీగా వాదనలను వినిపించేలా టీజీపీఎస్సీ సన్నద్ధ మవుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ పేపర్లు మళ్లీ దిద్దుతే సాంకేతిక సమస్యలు పునరావృతమవుతాయని భావించిన కమిషన్, అప్పీల్‌కు వెళ్తేనే బాగుంటుందనే సమావేశంలో అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలి సింది.

రెండుమూడేళ్లుగా గ్రూప్ పరీక్షలు వాయిదా పడడం, పేపర్లు లీకేజీ కావడం, నోటిఫికేషన్ రద్దు జరగడం లాంటి కారణాలతో నోటిఫికేషన్ ఆలస్యమవతూ వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వ హయాలో వేసిన 503 పోస్టులకు అదనంగా మరో 60 పోస్టులను కలిపి మొత్తం 563 పోస్టులతో గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను నిర్వహించి ఫలితాలు, జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో అవకతవకలు, అక్రమా లు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తూ వచ్చారు.

కేవలం రెండు సెంటర్ల నుంచి ఎక్కువ మంది ఉద్యోగానికి ఎంపికకావడం, పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యలో తేడా ఉండడం, తెలుగు మీడియం వారికి మా ర్కులు తగ్గాయని, రీవాల్యుయేషన్‌లో తేడాలున్నాయని లాంటి కారణాలతో పలువురు అభ్యర్థులు  హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ గత మంగళవారం ఫలితాలను రద్దు చేస్తూ ఎనిమిది నెలల్లో రీవా ల్యుయేషన్ చేయాలి లేదా మళ్లీ మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించిన విష యం తెలిసిందే. ఈక్రమంలోనే దీనిపై లో తుగా స్టడీ చేసిన కమిషన్ డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించింది. 

కోర్టు ముందు అవే వాదనలు..

గతంలో పలుమార్లు పరీక్షలు వాయిదా, రద్దు జరగడంతో ఈసారి నిర్వహించిన పరీక్షలను ఎలాంటి అవకతవకలు లేకుండా పా రదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించామని కమిషన్ మొదటి నుంచి స్పష్టం చేస్తోంది. ఎలాంటి అపోహలు లేకుండా ఈసారి పరీక్షలకు అభ్యర్థులు హాజరుకావాలని అప్పట్లో సూచించింది.

తాము పరీక్ష నిర్వహణ ప్రక్రియనంతా యూపీఎస్సీ తరహాలో నిర్వహిస్తు న్నామని గతంలో చెప్పిన కమిషన్...తాము నిర్వహించిన పరీక్షలో ఎలాంటి లోపాలు లేవని, ఫలితాల విడుదలలోనూ అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామని మరోసారి కోర్టు ముందు బలంగా తమ వాదనలను వినిపించాలని భావిస్తోంది. ఈక్రమంలోనే డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేయనుంది. 

గ్రూప్ 3 నియామక ప్రక్రియ ఆలస్యం..

గ్రూప్ హైకోర్టు తాజా తీర్పుతో మిగిలిన నోటిఫికేషన్లపై నీలినీడలు అలుముకున్నాయి. దీనిపై స్పష్టత వస్తేగాని ముందుకుపోయే పరిస్థితి కనబడటంలేదు. ఈ అంశం తేలకముందే గ్రూప్ 3 పోస్టుల భర్తీ కొలిక్కి వచ్చే అవకాశంలేదు. మొత్తంగా గ్రూప్ నియామక ప్రక్రియ ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లకు అడ్డంకిగా మారింది.

783 పోస్టులతో గ్రూప్2, 1388 పోస్టులతో గ్రూప్3 నోటిఫికేషన్లు జారీచేసి పరీక్షలను నిర్వహించి ఫలితాలతోపాటు జీఆర్‌ఎల్‌ను సైతం విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మాత్రమే ఇంకా మిగిలున్నది. గ్రూప్ రాసిన వారిలో కొందరు గ్రూప్2, 3 పరీక్షలు కూడా రాస్తారు. తొలుత గ్రూప్ నియామక ప్రక్రియ చేపడితేగానీ, గ్రూప్2, 3 ముందుకు సాగేపరిస్థితి ఉండదు. అప్పటివరకు ఈ నోటిఫికేషన్లు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంతేకాకుండా మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఆలస్యమవ్వనున్నాయి.