calender_icon.png 23 February, 2026 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేగుంట మండలంలో అభివృద్ధికి శ్రీకారం

23-02-2026 06:01:45 PM

– ప్రైమరీ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల పరిదిలోని కరీంనగర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో  కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నేజెస్ ఎన్అర్ జిఎస్ పథకం కింద రూ.10 లక్షల నిధులు మంజూరవగా, నేడు భూమి పూజ కార్యక్రమాన్ని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని . పాఠశాల అభివృద్ధి ద్వారా విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.