calender_icon.png 10 July, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యుదయ కేంద్రం తెలంగాణ

10-07-2025 01:09:46 AM

  1. సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్రతలే ప్రభుత్వ విధానాలు
  2. సీఎఫ్‌వో సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): తెలంగాణలో పట్టణాల సంఖ్య గణనీయంగా ఉందని, ఆధునికత అభ్యుదయానికి కేంద్రంగా రాష్ట్రం రోజురోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్(సీఎఫ్‌వో) సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డును ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోందన్నారు.

ఫార్మా, ఐటీ కంపె నీలతోపాటు హౌసింగ్, అగ్రికల్చర్, హ్యాండ్లూ మ్స్ వంటి అనేక రకాల పారిశ్రామిక క్లస్టర్ల ని ర్మాణం జరుగుతుందన్నారు. లండన్‌లోని థే మ్స్ నది మాదిరిగా హైదరాబాద్‌లో మూసీ పునర్జీవన ప్రాజెక్టును  ప్రభుత్వం చేపట్టిందని స్పష్టం చేశారు. పెట్టుబడులకు తెలంగాణ రా ష్ర్టం స్వర్గ ధామం లాంటిదని వివరించారు. త్వరలో ఫ్యూచ ర్ సిటీ అందుబాటులోకి రాబోతుందని, అందులో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కీలకమని, ఉపాధి కల్పన, సంపద సృష్టికి వారి సలహాలు సూచనలు స్వీకరించి అమలు చేసేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంద ని భరోసా ఇచ్చారు. రాష్ర్ట ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను తమ కుటుంబసభ్యులుగా పరిగ ణిస్తుందని, కలిసి నడిచి మార్పునకు శ్రీకారం చూడదామని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు సీఎస్‌ఆర్ నిధులను రైతులు, మహిళల ప్రగతి కోసం కూడా ఖర్చు చేయాలని సూచించారు.

సీఎఫ్‌వోలు సంస్థల దశను నిర్దేశించే మార్గదర్శకులు అని తెలిపారు.  సామాజిక న్యా యం, సమానత్వం, సమగ్రతలు ప్రజాప్రభుత్వ పాలనలో కేంద్ర బిందువులు అని తెలిపారు.  కార్యక్రమంలో సీఐఐ నిర్వాహకులు శేఖర్‌రెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి, బీవీఆర్ మోహన్ రెడ్డి, ఎంవీ నరసింహం, గౌతమ్ రెడ్డి, సమీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.