calender_icon.png 10 July, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల సమగ్రాభివృద్ధికి ప్లేస్కూల్స్ దోహదం

10-07-2025 01:11:20 AM

- సీబీఐటీ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్‌బాబు 

- హైదర్షాకోట్ మాధవీనగర్‌లో లిటిల్ బ్లూమ్స్ ప్లేస్కూల్ ప్రారంభం 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 9 (విజయక్రాంతి): పిల్లల సమగ్రాభివృద్ధికి ప్లేస్కూల్స్ దోహదం చేస్తాయని సీబీఐటీ ఈఈఈ విభాగంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ జి సురేష్‌బాబు అన్నారు. పిల్లల్లో అభ్యసన నైపుణ్యాలు పెంపొందించడం, వారిలో సృజనాత్మక ఆలోచనలు రూపొందించడం, ఉత్సుకత, ఊహాశక్తిని రేకెత్తించడం లాంటివన్నీ ముందుగా ప్లేస్కూల్లో నే అలవాటు అవుతాయని చెప్పారు.

బండ్లగూడ జాగీర్‌లోని హైదర్షాకోట్ ప్రాంతంలో గల మాధవీనగర్‌లో ఏర్పాటుచేసిన లిటిల్ బ్లూమ్స్ ప్లేస్కూల్‌ను బీఆర్‌ఎస్ నాయకుడు రాముడుయాదవ్‌తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూలు ప్రిన్సిపల్ జి.సౌజన్య మాట్లాడుతూ.. “మా ప్రీస్కూల్‌లో పిల్లలకు ఆటల ద్వారా నేర్పించే విధానం అవలంభిస్తూ వారి సమగ్రాభివృద్ధికి అవసరమైన చక్కటి వాతావరణాన్ని కల్పిస్తాం” అని చెప్పారు. బీఆర్ ఎస్ బండ్లగూడ జాగీర్ ప్రధాన కార్యదర్శి వి రాముడు యాదవ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో లిటిల్ బ్లూమ్స్ స్కూల్ రావడం వల్ల ఈ ప్రాంత వాసులపిల్లలకు మంచి నేర్చుకునే వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.