calender_icon.png 10 July, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుట్‌పాత్ ఆక్రమణలపై కొరడా

10-07-2025 01:09:38 AM

- తార్నాకలో దుకాణాల తొలగింపునకు ఆదేశం

- పచ్చదనంతోనే భవిష్యత్‌కు భరోసా: శ్రీలత

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్‌రెడ్డి ప్రజా సౌకర్యానికి ఆటంకంగా మారిన ఫుట్‌పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. తార్నా క చౌరస్తాలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న వీధి దుకాణాలపై కఠినంగా వ్యవహరించారు.

స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు టిటియుసి రాష్ర్ట అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డి, జీహెఎంసీ అధికారులతో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. తార్నాక ప్రధాన రహదారిపై అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ దుకాణాల ను గుర్తిం చి, వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. అంతకుముందు సికింద్రాబాద్ జోన్ పరిధిలోని నాగార్జుననగర్ పార్క్‌లో వనమహోత్సవం  కార్యక్ర మంలో ఆమె పాల్గొన్నా రు. పచ్చదనంతోనే భవిష్యత్‌కు భరోసా అని ఆమె చెప్పారు. టీటీయూ సీ రాష్ర్ట అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమం భవిష్యత్ పట్ల మనకున్న బాధ్యతను గుర్తుచేస్తోందని పేర్కొన్నారు.