9 April, 2026 | 9:06 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

కమ్యూనిస్టులకు అధికారం ఇస్తే అభివృద్ధి

02-11-2025 08:28 PM

చిట్యాల (విజయక్రాంతి): కమ్యూనిస్టులకు అధికారం ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో కేరళ రాష్ట్రంలో నిరూపించి చూపామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. వెల్లంకి గ్రామంలో ఏర్పాటు చేసిన శాఖ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై జహంగీర్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో సిపిఎం నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వం 64 వేల పేద కుటుంబాలను గుర్తించి విద్య, వైద్యం మౌళిక సదుపాయాలు అందించి తీవ్ర పేదరికన్ని జయించి దేశంలోనే అగ్రస్థానంలో కేరళ ప్రభుత్వం నిలిచిందని అన్నారు.

ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలను మోసం చేసి అమలుకాని హామీలిచ్చి ఆర్ధిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్న బూర్జవా పాలకులకు ఇది చెంప పెట్టు లాంటిదని అన్నారు. నిత్యం ప్రజల పక్షాన నిలిచే కమ్యూనిస్టులను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతీ గ్రామం ఓ కేరళలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం సీనియర్ నాయకులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటి సభ్యులు వనం ఉపేందర్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నర్సింహా చారి, శాఖ కార్యదర్శి ఆవనగంటి నగేష్, నాయకులు, బర్ల బాబురావు, కర్రే బాలయ్య, పున్న దత్తద్రి, ఆవనగంటి స్వామి, కన్నెబోయిన రాజలింగం, తాటిపాముల నవీన్, అంకేం నాగరాజు, అవనగంటి హరీష్, తాటిపాముల మహేష్, బిక్షం, చెన్ను స్వామి తదితరులు పాల్గొన్నారు.