28 March, 2026 | 3:04 AM

రోడ్డు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం

28-03-2026 12:42 AM

మంజూరైన రోడ్ల పనుల్లో బ్లాక్ స్పాట్స్ గుర్తించాలి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, మార్చి 27 : రోడ్లు బాగుంటేనే అన్ని రంగాల్లో అభివఅన్ని సాధ్యమవుతుందని మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడానికి మునుగోడుకు వచ్చిన ఆయన, క్యాంపు కార్యాలయంలో గ్రామస్తులు,ముఖ్య నాయకులతో చిట్చాట్ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 67 రోడ్లు, రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 22 రోడ్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్లలో ప్రమాదాలకు కారణమయ్యే మూల మలుపులు (బ్లైండ్ స్పాట్స్) ఎక్కువగా ఉన్నాయని గుర్తించామని చెప్పారు.

అలాంటి ప్రమాదకర మలుపులను తొలగించి, రోడ్లను సూటిగా అభివృద్ధి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే వేగ నియంత్రణ కోసం స్పీడ్ బ్రేకర్స్, గ్రామాల వద్ద పేర్లతో సైన్ బోర్డులు, బ్లింకింగ్ లైట్స్ ఏర్పాటు చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.అవసరమైతే తానే స్వయంగా పనులను పరిశీలించి, ప్రమాదపు మూల మలుపులు లేని సురక్షితమైన రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.