08-12-2025 08:18:41 AM
ఇద్దరు ముఖ్యమంత్రులు మారిన లక్ష్మాపూర్ రైతుల సమస్య మాత్రం అలానే ఉంది.... కవిత
శామీర్ పేట్: ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఇలాగే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Telangana Jagruti President Kavitha) విమర్శించారు. ఆదివారం ఆమె మేడ్చల్ జిల్లాలోని లక్ష్మాపూర్ పర్యటించి అక్కడ రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులు మారిన లక్ష్మాపూర్ రైతుల సమస్య మాత్రం మారడం లేదని ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఇలాగే ఉందని విమర్శించారు.లక్ష్మాపూర్ ఆగిన సిఎం కేసిఆర్ నక్ష లేదని తెలుసుకుని నక్ష చేయాలని అధికారులను ఆదేశించారు.
అయినా నక్షలో లోపాలు ఉండటం వలన రైతులు ఇబ్బందులు వడుతున్నారు. అలాగే సిఎం రేవంత్ రెడ్డి కూడ ఈ గ్రామంలో పర్యటించి నమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. రెండేళ్లయిన సమస్య పరిష్కారానికి నోచుకోలేదని చెప్పారు. మనందరం ఏకమై భూ సమస్యపై పోరాటం చేద్దామని తనతో గ్రామస్థులందరు కలిసి రావాలని పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువ నాయకుడు మధు కృష్ణ, డౌటే గోపాల్, పాండు, కటికల కరుణాకర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.