calender_icon.png 3 February, 2026 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

03-02-2026 12:24:26 AM

చిట్యాల, ఫిబ్రవరి 2 : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజల నమ్మకం కాంగ్రెస్ పైనే ఉందని ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం తెలిపారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి. 06వ వార్డుకు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రణేయ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై  నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని, ప్రజల నమ్మకం కాంగ్రెస్ పైనే ఉందని, కాంగ్రెస్  పార్టీ అభ్యర్థులు అధిక మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో మనోజ్, గణేష్, స్వామి, భాను, హరికృష్ణ, సత్తీ, శ్రీకాంత్, సాయి, వెంకన్న ఉన్నారు.