15 April, 2026 | 3:18 AM

ఆత్మ గౌరవం మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా?

03-02-2026 12:26 AM

బీఆర్‌ఎస్ నేతలపై వీహెచ్ ఫైర్

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేతలకి ఆత్మ గౌరవం ఇప్పుడు గుర్తు వచ్చిందా? అని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియా తో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహా రంపైన సిట్ విచారణలో భాగంగా చాలా మందిని విచారించారని, అందులో భాగంగానే కేసీఆర్ విచారణ జరిగిందన్నారు.

టీఆర్‌ఎస్ పేరు బీఆర్‌ఎస్‌గా మార్చినప్పుడు ఆత్మ గౌరవం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. తాను అంబేద్కర్ విగ్రహం పంజగుట్ట లో పెడితే కూలకొట్టారని, ఇప్పుడు కక్ష సాధింపు అనడం తగదన్నారు.