calender_icon.png 25 August, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎములాడ రాజన్న దీవెనలతో అభివృద్ధి సాధ్యం

25-08-2025 01:41:42 AM

- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

-  టెంపుల్ సిటీగా వేములవాడ అభివృద్ధి చేస్తాం

రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 24 (విజయక్రాంతి) తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి నా ఒక్కడి ఏజండా కాదని,ఇది రాజ న్న భక్తుల ఎజెండా అని.ఆదివారం రూ 6 కోట్ల 50 లక్షలతో రోడ్డు నిర్మాణనికి ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్,జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ల తోశంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ప్ర భుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూవేములవాడలో ములవాగు బ్రిడ్జి నుండి రా జన్న ఆలయం వరకు రూ 6 కోట్ల 50 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు.

రహదారి పనులు 2 నెలల లోపు పూర్తి అవుతాయన్నారు.రాష్ట్ర వ్యాప్తం గా వేములవాడ రోడ్డు వెడల్పు పనుల కో సం ఎదురు చూస్తున్నారన్నారని.తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్ర త్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసిందన్నారు.ప్ర భుత్వం ఏర్పడిన మొదటి మాసంలోనే వీటిడిఏ సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ పోయి న 20 కోట్ల నిధులను తిరిగి తెప్పించి బద్ధిపోచమ్మ ఆలయం వద్ద అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంఅంభించామన్నారు.

గత మా జీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన విష యం నా లగ్గం ఇక్కడే అ యిందని, ఆలయ అభివృద్ధికి ఏటా వంద కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తానని మా టిచ్చి భక్తులను మోసం చేశాడని గుర్తు చేశా రు.ప్రతి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఎం తో ఆశగా ఎదురు చూశామన్నారు. బడ్జెట్ విషయంలో ఆల య అభివృద్ధికి భక్తులకు మొండి చేయి చూపెట్టారని పేర్కొన్నారు. 2014 ముందు రాజ న్న ఆలయం ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలానే ఉందన్నారు .ప్రస్తుతం రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం రూ150 కో ట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగిందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని 8 మంది మంత్రుల చేతుల మీదుగా వేములవాడలో సుమారు రూ1000 కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. రోడ్డు వెడల్పులో భూములు కోల్పోయిన నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, వారిని ఎల్లవేళలా గుర్తు చేసుకుంటాం వారి కి 2013 భూసేకరణ చట్టం ద్వారా నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు. అధు నాతన పద్ధతుల్లో లైటింగ్ సిస్టం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సాధించారన్నా రు.

త్వరలోనే రూ 76 కోట్లతో రాజన్న ఆల య మొదటి దశ అభివృద్ధి పనులు ప్రారం భం చేయడం జరుగుతుందన్నారు.ఇప్పటికే అగ్రిమెంట్లు పూర్తయి నమూనాలు త్వరలోనే వస్తాయన్నారు.శృంగేరి పీఠాధిపతులు అనుమతులు ఇప్పటికే తీసుకోవడం జరిగిందని,వేములవాడ పరిరక్షణ సమితి పట్టణ ప్రజల ఆలోచనలు సలహాలు సూచనలు తీసుకోవడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సందీప్ కు మార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే, ఆలయ ఈవో రాధ భాయి,మున్సిపల్ కమిషనర్ అన్వేష్,సెస్ డైరెక్టర్ నామాల ఉమా ల క్ష్మీరాజం, మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండి రాజు,చెలకల తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.