calender_icon.png 25 August, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణను దేశంలోనే అగ్రమిగా తీర్చిదిద్దాం

25-08-2025 01:39:37 AM

చార్ సౌ బీస్ హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

రాజన్న సిరిసిల్ల: ఆగస్ట్ 24, (విజయక్రాంతి)తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్ది తెలంగాణకు ఒక ఖ్యాతిని సంపాదించి పెట్టిన ఎమ్మెల్యే కేటీఆర్ ను ఉద్దేశించి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన తీరు ని తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.

ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనిషిలాగ మాట్లాడితే బాగుంటదని.. రాష్ట్రంలోని ప్రజలందరినీ మోసం చేసిన చార్ సౌ బీస్ హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న నువ్వు ఎవరిని థర్డ్ క్లాస్ అంటున్నావో రాష్ట్ర, సిరిసిల్ల జిల్లా ప్రజలకు,చొప్పదండి నియోజకవర్గం ప్రజలకు తెలుసన్నారు.

ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి , చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి థర్డ్ క్లాస్ ఆ. ఎవరో మీరే ఆలోచన చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, గజ బింకర్ రాజన్న, కుంభాల మల్లారెడ్డి తదితరులుపాల్గొన్నారు.