calender_icon.png 16 August, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల అభివృద్ధి. ఐక్యతకు సహకరించాలి

21-09-2024 02:22:07 AM

బీసీ ఫెడరేషన్ కులాల సమితి

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): సెప్టెంబర్ 24 న రవీంద్రభారతిలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు బీసీ కార్పొరేషన్ చైర్మన్‌లకు నిర్వహించనున్న ఆత్మీయ సన్మాన సభకు రావాలని మంత్రి కొండా సురేఖను తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి నాయకులు ఆహ్వానించారు. శుక్రవారం ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.  బీసీల అభివృద్ధికి, ఐక్యతకు తాము చేపట్టే కార్యక్రమాలకు మద్దతునివ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున తనవంతు సహకారం అందిస్తానని వారికి మంత్రి సురేఖ హామీ ఇచ్చారు.