calender_icon.png 4 July, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం నగరానికి ధీటుగా మండల హెడ్‌క్వార్టర్ అభివృద్ధి

04-07-2025 12:31:24 AM

- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

- గత 18 నెలల కాలంలో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి 1500 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు

- కూసుమంచి మండలంలో 5.5 కోట్లతో జూనియర్ కళాశాల నిర్మాణం

ఖమ్మం, జూలై 3 (విజయ క్రాంతి): నగరాలకు ధీటుగా కూసుమంచి మండల హెడ్ క్వార్టర్‌ను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.మంత్రి కూసుమంచి మండలంలో ఖమ్మం ఎంపి రామసహాయం రఘు రాం రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిల తో కలిసి గురువారం పర్యటించి పలు రోడ్డు నిర్మాణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు.

ధర్మతండా గ్రామంలో 36 లక్షలతో కూసుమంచి ఆర్ అండ్ బి రోడ్డు నుండి ధ ర్మతండా వరకు చేపట్టిన రోడ్డు మరమ్మతు ల పనులకు, లోక్యాతండా గ్రామంలో ఒక కోటి 26 లక్షలతో లోక్యాతండా నుండి ధర్మతండా వరకు, ఒక కోటి 16 లక్షలతో లోక్యా తండా నుండి అగ్రహారం వరకు చేపట్టిన రో డ్డు మరమ్మత్తు పనులకు, కోక్యాతండా గ్రా మంలో 2 కోట్ల 90 లక్షలతో కోక్యాతండా నుండి వీర్యాతండా వరకు నిర్మించనున్న బి. టి. రోడ్డు నిర్మాణ పనులకు, గన్యాతండా గ్రా మంలో 3 కోట్ల 30 లక్షలతో గన్యా తండా నుండి మోటాపురం వీరన్న స్వామి టెంపుల్ వరకు నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ ప నులకు, కూసుమంచి గ్రామంలో 6 కోట్ల 50 లక్షలతో చేపట్టిన జంక్షన్ అభివృద్ధి ప నులకు, ఖమ్మం - కోదాడ, కూసుమంచి, నేలకొండపల్లి పట్టణ పరిధిలోని కూసుమంచి, నేలకొండపల్లి రోడ్డులో ఏర్పాటు చేయు డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రి శం కుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూసుమంచి, నేలకొండపల్లి మండల హెడ్ క్వార్టర్ లలో 6 కోట్ల 50 లక్ష ల రూపాయలతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, డివైడర్స్, జంక్షన్ అభివృద్ధి పనులు కొద్ది నెలల్లో పూర్తి చేస్తామని, ఖమ్మం నగరానికి ధీటుగా కూసుమంచి మండల హెడ్ క్వార్టర్ ను తయారు చేస్తామని అన్నారు.50 లక్షల రూపాయలతో షాదీ ఖానా మంజూరు చే సుకున్నామని అన్నారు.  ప్రభుత్వ జూనియ ర్ కళాశాలను సుమారు ఐదున్నర కోట్ల రూ పాయలతో మంజూరు చేశామని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమే ష్, ఇర్రిగేషన్ ఎస్‌ఇ ఎం. వెంకటేశ్వర్లు, ఇఇ మిషన్ భగీరథ వాణిశ్రీ, హౌజింగ్ పిడి భూ క్యా శ్రీనివాస్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, విద్యుత్ శాఖ ఏడిఇ లోక్యా నాయక్, కూసుమంచి మండల తహసీల్దార్ రవికుమార్, ఎంపిడివో వేణుగోపాల్ రెడ్డి,  ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.