08-11-2025 12:09:22 AM
మంత్రి శ్రీధర్‌బాబుతోనే సాధ్యం
మంథని, నవంబర్07(విజయ క్రాంతి) మంథని నియోజకవర్గం అభివృద్ధి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం ఎస్సి సబ్ ప్లాన్ నిధులతో సిసి రోడ్డు, డ్రైనేజి నిర్మాణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు ఆదేశాల మేరకు మంథని మండలంలోని పుట్ట పాక గ్రామం లోని ఎస్ సి కాలనీలో ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న,
సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ఎస్సి సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యనారాయణ, మండల అధ్యక్షుడు మంథని రాకేశ్, కాంగ్రెస్ నాయకులు రూ.5 లక్షలతో చేపట్టిన సిసి రోడ్డు, డ్రైనేజి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రసాద్, ఎస్సి సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యనారాయణ, మండల అధ్యక్షుడు మంథని రాకేశ్ మాట్లాడుతూ మండలానికి ఎస్సి సబ్ ప్లాన్ నిధులు రూ. 2 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
ఈ నిధులతో గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనేజి లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని, ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామాల అభివృద్దికి శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో మంత్రి శ్రీధర్ బాబు సహకారం తో మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుoదని అన్నారు.
ఈ కార్యక్రమం లో సింగిల్ విండో డైరెక్టర్ పెద్దిరాజు ప్రభాకర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చాట్లపల్లి సంతోష్, మాజీ సర్పంచులు అయిలి శ్రీనివాస్, కల్వల రాజేశం, నాయకులు సవాయి గణేష్, చాట్లపల్లి మధు, కన్నూరి రాజబాపు, ఎండి హుస్సేన్ భీ, శీలం ప్రభాకర్, కన్నూరి సుదర్శన్, పోచయ్య, రాజయ్య, తిరుపతి, ఇల్లుటం వెంకటేష్, రోడ్ద నరేష్, మంథని శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.