08-11-2025 12:08:02 AM
బూర్గంపాడు,నవంబర్ 7,(విజయక్రాంతి): మండలంలోని అంజనాపురం గ్రా మానికి చెందిన షేక్ ఖాసీం గుండె,ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో భద్రాచలం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయాన్ని గ్రామస్తులు మోరంపల్లి బంజర్ గ్రా మానికి చెందిన నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకురావడంతో వారు స్పం దించి గురువారం రూ.8,000 ఆర్థికసాయంగా అందించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న షేక్ ఖాసీం కు సహాయం అందించడానికి దాతలు ముందుకు రావాలని ట్రస్ట్ చైర్మన్ బత్తుల రామ కొండారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చింత అంకిరెడ్డి,గౌరవ సలహాదారులు సంకా సురేష్ ,సభ్యులు ఆవుల నాగార్జున, డి బాలనారాయణ రెడ్డి,ఆరుట్ల రాఘవచారి పాల్గొన్నారు.