కాంగ్రెస్‌తోనే పాతబస్తీ అభివృద్ధి
హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి వలీవుల్లా సమీర్
చాంద్రాయణగుట్ట, మే 2 (విజయక్రాంతి): పాతనగర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మహ్మద్ వల్లీవుల్లా సమీర్ అన్నారు. చార్మినార్ నియోజకవర్గం పరిధిలో పలు బస్తీలలో ఇంటిం టికీ వెళ్లి గురువారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే దేశంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు విజయవంతంగా అమలు అవుతున్నా యని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే జాతీయ స్థాయిలో ఇచ్చిన హామీ లు నూటికి నూరుశాతం అమలు అవుతాయన్నారు. ఇచ్చిన మాట మీద నిలబ డే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజల అభివృద్ధియే సీఎం లక్ష్యమ న్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, చార్మి నార్ ఇన్‌చార్జి ముజీబుల్లా షరీఫ్, మా జీ ఇన్‌చార్జి కే వెంకటేశ్ పాల్గొన్నారు.




