లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల అధికారులు, పోలీస్, ఎన్నికల వ్యయ పరిశీలకులతో పాటు రాష్ట్ర ఎన్నికల సీఈఓతో కేంద్ర ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ సీఈవో నితీష్‌వ్యాస్ గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ.. ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్త యిందని, హోమ్ ఓటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలింగ్ బూత్‌ల వద్ద టెంట్, తాగునీరు, లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పోలింగ్ స్టేషన్లలో బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు హైదరా బాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు డాక్టర్ సరోజ్‌కుమార్, శ్రీవిద్య పాల్గొన్నారు.




