4 April, 2026 | 8:19 PM

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

04-04-2026 06:53 PM

– గోదాం రోడ్ సీసీ రోడ్డుకు భూమిపూజ

కోనరావుపేట,(విజయక్రాంతి): గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కోనరావుపేట సర్పంచ్ మస్కూరి కాశిరామ్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో రూ.83 లక్షల ఎం.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో గోదాం రోడ్ సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించి గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్తోందన్నారు.

గత ప్రభుత్వంలో పూర్తి కాలేని అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తోందని పేర్కొన్నారు.ఈ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జింక రేవతి, మార్కెట్ డైరెక్టర్ మేకల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్ గౌడ్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ రమేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవరకొండ నరసింహ చారి, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.