4 April, 2026 | 8:30 PM

పారిశుధ్య పనుల పర్యవేక్షించిన సర్పంచ్

04-04-2026 06:56 PM

దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట ప్రధాన రహదారి వెంబడి గల డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను శనివారం జయలక్ష్మి దియేటర్ నుండి తొలగిస్తున్న పారిశుధ్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించిన సర్పంచ్ పగడాల రమాదేవి.  ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దుర్గంధం వెదజల్లుతున్న డ్రైనేజీలను శుభ్రం చేసి, దోమల నివారణ చర్యలు చేపట్టె ఉద్దేశ్యంతో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని,

ప్రజలు సహకరించి మురుగు నీరు నిల్వ ఉండకుండా, చెత్త వేయకుండా, చెత్త పెరగకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరి పై ఉందని అన్నారు. తదనంతరం వీధి వీధిన తిరిగి ప్రజలకు పరిశుభ్రత పై అవగాహన కల్పించి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పలువురు తమ పరిసరాల సమస్యలను పాలక వర్గ సభ్యులకు తెలియజేశారు. మురుగు కాల్వలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మంచినీళ్ళ బాటిల్స్ ని, డ్రింక్స్ ని అందించారు.