అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
21-08-2026 12:00 AM
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి-
ఇబ్రహీంపట్నం ఆగస్టు 20 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో రూ.1.05కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించి, పంచాయతీ సిబ్బందితో సరదాగా సంభాషిస్తూ వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో రూ.50లక్షలతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీని, రూ.5లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును మరో రూ.20లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ, రూ.10లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పోచారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేశారు.






