21 August, 2026 | 1:41 AM

రాంచందర్ రావు,బండి వ్యాఖ్యలను ఖండించిన కోమటిరెడ్డి

21-08-2026 12:00 AM

ముకరంపుర, ఆగస్టు20(విజయక్రాంతి): స్వాతంత్రోద్యమంతో సంబంధం లోని బీజేపీ పార్టీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబం పై బురుద జల్లాలని చూస్తుందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు.స్థానిక మాజీ సు డా చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1950 లో భారత జాతీయ కాంగ్రెస్ వందేమాతరం గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించిందని,1951 లో జనసంఘ్ పార్టీ ఆవిర్భవించిందని 1980 లో జనసంఘ్ భారతీయ జనతా పార్టీ అయ్యిందని బీజేపీకి కాంగ్రెస్ పార్టీని గానీ కాంగ్రెస్ నాయకులను గానీ విమర్శించే నైతిక హక్కు లేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ల పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు,కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నరేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రెండు సార్లు ప్రధాన మంత్రి గా అవకాశం వచ్చినా సున్నితంగా సో నియా గాంధీ తిరస్కరించారని ఓటమెరుగని నిబద్ధతగల ప్రజా నాయకులు మల్లికార్జున ఖర్గే అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రశ్నించిన విద్యార్థులపై దమనకాండ జరిపిన బీజేపీపై దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారని ఫీజురీయింబర్స్ మెంట్ పేరుమీద మొసలి కన్నీరు కారుస్తున్నారని 10 సంవత్సరాలు బీఆర్‌ఎస్ పార్టీతో అంటకాగి 8 లక్షల కోట్ల అప్పుకు కారణం బీజేపీ కూడా కారణమని అప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ ఒక్క రూపాయి ఇవ్వకున్నా పెదవులు తెరవలేదని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.

ఈ విలేకరుల సమావేశంలో పర్వతం మల్లేశం,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,కుర్ర పోచయ్య,జీడి రమేష్,ముక్క భాస్కర్, లయక్,మూల కృష్ణారెడ్డి,పెద్దిగారి తిరుపతి,మేకల నర్సయ్య,మామిడి సత్యనారాయణ రెడ్డి,తోట అంజయ్య,గుడిపాటి రమణా రెడ్డి,షెహెన్ష,ఖలీల్,బత్తుల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.