14-08-2025 12:46:52 AM
రఘునాధపాలెం మండలం దొనబండ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల
ఖమ్మం, ఆగస్టు 13 (విజయ క్రాంతి): అడవులను సంరక్షించుకుంటూనే ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి అవసరమైన మౌళిక వసతుల కల్పన పనులు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.మంత్రి రఘునాధపా లెం మండలం దొనబండ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి బుధవారం శంకు స్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమ స్య పరిష్కరిస్తామని అన్నారు.గ్రామంలో అవసరమైన డొంక రోడ్లను నెల రోజుల్లో మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చా రు.
సొంత జాగా ఉండి గుడిసెల్లో, వర్షాలకు కురుస్తున్న ఇండ్లలో ఉంటున్న నిరుపేదలకు, తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం నడుచుకోవాలని అన్నారు. కొత్తగా అడవుల ఆక్రమణకు ఎవరు పాల్పడటానికి వీలు లేదని అన్నారు. గిరిజన రైతులు పోడు భూములలో ఆయిల్ పామ్ సాగు చేయాలని అన్నారు.
రఘునాధపాలెం మండలంలో మంచి విద్య అందించే ప్రము ఖ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అధికారులు మానవీయ కోణంలో ఆలోచిస్తూ పేదల జీవితాల కోసం పని చే యాలని అన్నారు. 3 నెలల కాలంలో 30 కోట్ల తో రోడ్లు నిర్మించామని అన్నారు. అడవుల నరికి వెతకు తాను వ్యతిరేకమని, అడవి ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అ న్నారు. అడవుల నరికివేత వల్ల గ్రామాలలో కోతుల సమస్య పెరిగి పోయిందని అన్నారు.
భూమి మీద అందరం బ్రతకాలని అన్నారు. ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు అందించిన పొలాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని అన్నా రు. బుగ్గ వాగు నుంచి కూడా మండలంలో 30 చెరువులు నింపేలా చర్యలు చేపడతామ ని అన్నారు. ఆయిల్ పామ్ పంటతో అంతర్ పంటలను వేసుకొని ఆదాయం సంపాదించుకోవచ్చని అన్నారు. పేద ప్రజలకు రాజ కీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గి డ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రా వు, భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్, డిఎఫ్‌ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్, గిరిజన సం క్షేమ శాఖ ఉప సంచాలకులు విజయలక్ష్మి, ఖ మ్మం ఆర్డిఓ నరసింహా రావు, పీఆర్ ఎస్‌ఇ వెంకట్ రెడ్డి, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.