13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

మున్సిపాలిటీలో ముమ్మరంగా అభివృద్ధి పనులు

31-03-2026 12:32 AM

మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్

గుమ్మడిదల మార్చి30: గుమ్మడిదల మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ దశరథ్ కలిసి మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి, అన్నారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.బొంతపల్లి 21వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులను వార్డు కౌన్సిలర్ శ్రీచూర్ణం చక్రపాణి ఆధ్వర్యంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.అనంతరం అన్నారం 5వ వార్డులోని కేవార్డు కౌన్సిలర్ మేడిపల్లి మురళి ఆధ్వర్యంలో కెసిఆర్ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ చిమ్ముల సంధ్య గోవర్ధన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు రాజశేఖర్, కిషన్, సంజీవ రెడ్డి,కుమార్ గౌడ్, విజయలక్ష్మి, జైపాల్ రెడ్డి నాయకులు హుస్సేన్, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేష్, ఆంజనేయులు యాదవ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.